AP Library Recruitment 2021 | telugujobalerts24

Advertisement

10th base AP Library Jobs :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కృష్ణా జిల్లాలోని గ్రంథాలయ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా గ్రంథ పాలకులు మరియు రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థలలో విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు :
గ్రంథాలయ సంస్థ
పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల వారికి క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
గ్రంధపాలకులు – 03, రికార్డ్ అసిస్టెంట్ – 01

అర్హతలు :

విద్యార్హతలు : పౌర గ్రంథాలయ సంస్థ ద్వారా విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు క్రింది విద్యార్హతతో పాటు మరిన్ని అర్హతలను కలిగి ఉండాలి.
గ్రంధపాలకులు :
> లైబ్రరీ సైన్స్ విభాగంలో బియస్సి, కంప్యూటర్ సైన్స్ సెర్టిఫికేట్ లేదా
> ఏదైనా డిగ్రీతో పాటు డేటా ఎంట్రీ స్కిల్స్ సెర్టిఫికేట్ కలిగి ఉండాలి.

Advertisement

Read More : 10వ తరగతి పై గల ఉద్యోగాలు – క్లిక్ హియర్

రికార్డ్ అసిస్టెంట్ :
> యస్ యస్ సి పాస్ తో పాటు కంప్యూటర్ లో డేటా ఎంట్రీ సెర్టిఫికేట్ కలిగి ఉండాలి.
వయస్సు :
18 – 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / ST / BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం :
ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే పౌరగ్రంథాలయ శాఖ వారి ప్రకారం వేతనాన్ని చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
> అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
> అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ముఖ్యమైన లింకులు భాగంలోని అప్లికేషన్ ఫారం అనే అప్షన్ పై క్లిక్ చేసి అప్లికేషన్ పత్రమును డౌన్లోడ్ చేసుకోని తగు జాగ్రత్తలతో నింపండి.
> అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
> అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
> అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
> అప్లికేషన్ ఫామ్ మరియు తగు అర్హతల పత్రాలను “కార్యదర్శి, కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ, పోర్టు రోడ్డు, మచిలీపట్నం – 521001” అనే చిరునామా కు చేరవేయండి.
> భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ చేయండి
దరఖాస్తు ఫీజు :
జనరల్ మరియు మిగితా అభ్యర్థులు, ఎవ్వరికీ ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.

Read More – ఇంటర్ ఆధారిత ఉద్యోగాలు – క్లిక్ హియర్

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక, ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ ( మెరిట్ ) ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి సమాచారం మరియు సిలబస్ కొరకు క్రింది ముఖ్యమైన లింకుల విభాగంలోని నోటిఫికేషన్ నందు పొందుపరుస్తాను, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ – 28/01/2021
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
అధికారిక వెబ్సైట్ : క్లిక్ హియర్
గమనిక :
ఈ ప్రకటనలోని ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతం అలానే మరింత సమాచారం కొరకు క్రింది నంబర్లకు సంప్రదించండి.
ఫోన్ నంబర్లు :
08672 – 222221
సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

Advertisement

17 thoughts on “AP Library Recruitment 2021 | telugujobalerts24”

    • తప్పకుండా తెలియజేస్తానంది. మరిన్ని ఇటువంటి Telugujobalerts24 అనే మా వెబ్సైట్ ని సందర్శిస్తూ ఉండండి

      Reply

Leave a Comment