APSRTC లో 9781 కండక్టర్ మరియు డ్రైవర్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( APSRTC ) అతి త్వరలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. గత సంవత్సరం మార్చి నెలలో ఈ నోటిఫికేషన్ విడుదల చేయాల్సింది కానీ కరోన కారణంగా వాయిదా పడింది. మరి ఈ సారి డ్రైవర్ మరియు కండక్టర్ విభాగాలలో కలిపి మొత్తం 9781 పోస్టులను భర్తీ చేయడం జరుగనుంది.

APSRTC Recruitment 2021

స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే కేవలం మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని పొందినట్లైతే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లోని ఆయా ఏపియస్ఆర్టీసీ డిపోల నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ పేరు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( APSRTC )
పోస్టులు : ఏపియస్ ఆర్టీసీ ద్వారా విడుదలయ్యేటువంటి ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నారు.
డ్రైవర్ – 4158
కండక్టర్ – 5623

అర్హతలు :

విద్యార్హతలు : APSRTC నుండి విడుదలయ్యేటువంటి నోటిఫికేషన్ లోని వివిధ పోస్టులకు దరఖాస్తు చేయగోరు అభ్యర్థులు పోస్టుల వారీగా క్రింది విద్యార్హతలు కలిగి ఉండాలి.
౼ డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
౼ కండక్టర్ – 10వ తరగతి పాసైతే చాలు
వయస్సు :
18 – 45 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / STఅభ్యర్థులు – 5 సం, BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.

Read Also : గ్రంథాలయ శాఖలో 10వ తరగతితో ఉద్యోగాలు

జీతం :
ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే సవరించిన ఏపియస్ఆర్టీసీ వారి స్టాండర్డ్స్ ప్రకారం వేతనం అందుకుంటారు.
దరఖాస్తు విధానం :
౼ అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
౼ అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
౼ అభ్యర్థులు నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
౼ అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
౼ అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
౼ అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
౼ భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
త్వరత్వరలో తెలియజేస్తారు.

ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక ఎటువంటి రాతపరీక్ష లేకుండానే, 10వ తరగతిలో పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా జరుగుతుంది. ఈ ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింది ముఖ్యమైన లింకులు సెక్షన్ లోని నోటిఫికేషన్ నందు పొందుపరిచారు, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.

సూచన : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలో ఆర్టీసీ నుండి డ్రైవర్ లేదా కండక్టర్ ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా, అయితే మీ జిల్లా పేరు ను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇక ఆ బాధ్యత మేము తీసుకొని నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీకు తెలియజేస్తాము. కొంత కాల వ్యవధిలో ఉద్యోగ ఖాళీలను మాత్రమే అందిస్తాము.

Read Also : అమెజాన్ లో సరికొత్త ఉద్యోగ అవకాశాలు

Read Also : 10వ తరగతి విద్యార్హతతో ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు