Advertisement
IGM Kolkata – SPMCIL Recruitment 2021 :
నోట్ల ముద్రణ సంస్థ, ఇండియా గవర్నమెంట్ మింట్ నందు ఖాళీల ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ బులియన్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, సూపర్‌వైజర్, ఎంగ్రేవర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే జాబ్ కావాలనుకునే వారూ ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు అభ్యర్థులు ఎంపికయినట్లైతే కలకత్తా లోని ఇండియా గవర్నమెంట్ మింట్ నందు విధినిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
IGM Kolkata Recruitment Vacancies 2021 ( పోస్టులు ) : ఆర్బిఐ నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ నందు క్రింది పోస్టులను భర్తీ చేయనున్నరు.
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ – 12
జూనియర్ టెక్నీషియన్ – 16
సూపర్‌వైజర్ – 10,
ఎంగ్రేవర్ – 06
జూనియర్ బులియన్ అసిస్టెంట్ – 10
Advertisement
IGM Kolkata-SPMCIL Recruitment Notification 2021 Eligibility criteria :
విద్యార్హతలు :
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మరియు జూనియర్ బులియన్ అసిస్టెంట్ : డిగ్రీ ఉత్తీర్ణత.
జూనియర్ టెక్నీషియన్ : ఐటీఐ ( ఎలక్ట్రానిక్స్ ) ఉత్తీర్ణత.
సూపర్‌వైజర్ : ఇంజినీరింగ్ డిప్లొమా లేదా బీఈ / బీటెక్ / బీఎస్సీ ( ఇంజినీరింగ్ ) ఉత్తీర్ణత, అనుభవం.
ఎంగ్రేవర్ : బ్యాచిలర్ డిగ్రీ ( ఫైన్ ఆర్ట్స్ ).
వయస్సు :
18 – 30 సంవత్సరాల లోపు వయస్సు కలిగి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
SC / STఅభ్యర్థులు – 5 సం, OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పిస్తారు.
జీతం : ఈ ప్రకటన ద్వారా అభ్యర్థులు ఎంపికయినట్లైతే SPMCIL వారి స్టాండర్డ్స్ ప్రకారం పోస్టును అనుసరించి జీతం లభిస్తుంది.
IGM Kolkata – SPMCIL Recruitment 2021 Apply Procedure ( దరఖాస్తు విధానం ) :
• అభ్యర్థులు ఆన్‌లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• అధికారిక వెబ్ సైట్ igmkolkata.spmcil.com నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ అభ్యర్థులు – రూ 600/-
మిగితా అభ్యర్థులు – రూ 200/- లు ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానము :
అభ్యర్థుల ఎంపిక ఆన్ లైన్ రాతపరీక్ష ఆధారంగా ఉంటుంది. ఈ ఎంపికకు సంబంధించిన పూర్తి సమాచారం క్రింది ముఖ్యమైన లింకులు సెక్షన్ లోని నోటిఫికేషన్ నందు పొందుపరిచారు, డౌన్లోడ్ చేసుకొని గమనించండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు చివరి తేదీ – ఫిబ్రవరి 19, 2021
ముఖ్యమైన లింకులు : నోటిఫికేషన్లోని ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకుల పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
నోటిఫికేషన్ : క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లై : క్లిక్ హియర్ ( లింక్ ఆక్టివేట్ )
సూచన : ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి సందేహం ఉన్న క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే మీ సందేహాన్ని నివృత్తి కలిగిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల అభ్యర్థులు మీ జిల్లాలలోని ఉద్యోగ సమాచారాన్ని మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందలనుకుంటున్నారా అయితే, మీ జిల్లా పేరును కామెంట్ సెక్షన్ లో తెలియజేసి, పక్కనే ఎరుపు రంగులో కనపడే బెల్ గుర్తు పై క్లిక్ చేసినట్లయితే మేము ఎటువంటి ఉద్యోగ సమాచారాన్ని మా వెబ్ సైట్ నందు పొందుపరచగానే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.
మా యాప్ నుండి కూడా మరిన్ని ఉద్యోగాల సమాచారాన్ని పొందవచ్చు – డౌన్లోడ్
Advertisement