Advertisement
రైల్వే శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ :
రైల్వే శాఖ, వారణాసిలోని బనారస్ లోకోమోటివ్ వర్క్స్ ( BLW ) నందు ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ఐటీఐ అప్రెంటిస్, నాన్ ఐటీఐ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అప్రెంటిస్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎటువంటి రాతపరీక్ష లేకుండా కేవలం మార్కుల మెరిట్ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి, ప్రతిఒక్కరు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తైన వెంటనే సెర్టిఫికేట్ అందిస్తారు. ఈ సెర్టిఫికేట్ రెగులర్ విధానంలో పోస్టులను భర్తీ చేసే సందర్భంలో చాలా ఉపయోగపడుతుంది అనగా రిజర్వేషన్ ను కల్పిస్తారు. ఈ ఖాళీలను భర్తీ ప్రక్రియలో ఎంపికయినట్లైతే అభ్యర్థులు వారణాసిలో బియల్డబ్ల్యూ నందు విధి నిర్వహణ చేయవలసి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ పేరు | భారత రైల్వే |
పోస్టులు | ఐటీఐ అప్రెంటిస్, నాన్ ఐటీఐ అప్రెంటిస్ |
ఖాళీలు | 374 ఐటీఐ అప్రెంటిస్ – 300, నాన్ ఐటీఐ అప్రెంటిస్ – 74 |
అర్హత | ఐటీఐ అప్రెంటిస్ – 10వ తరగతి మరియు ఐటీఐ పాసై ఉండాలి. నాన్ ఐటీఐ అప్రెంటిస్ – కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత |
వయస్సు | ఐటీఐ అప్రెంటిస్ : 15-24 నాన్ ఐటీఐ అప్రెంటిస్ : 15 -22 ఏళ్ళు మించకూడదు. SC/ST అభ్యర్థులకు – 5 సం లు, BC అభ్యర్థులకు – 5 సం లు వయస్సులో సడలింపు |
దరఖాస్తు విధానం | ఆన్ లైన్ |
దరఖాస్తు ఫీజు | జనరల్ అభ్యర్థులు – రూ 100/- మిగితా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 18, 2021 |
దరఖాస్తు చివరి తేదీ | ఫిబ్రవరి 15, 2021 |
ఎంపిక విధానం | మెరిట్ |
ఇంటర్వ్యూ తేదీ | త్వరలో తెలియజేస్తారు |
వేతనం | రూ 10,000 నుండి 15,000/– |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ లైన్ అప్లై | క్లిక్ హియర్ |
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రిబ్ చేసుకోండి.
Advertisement
Advertisement