స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ లో 1324 జూనియర్‌ ఇంజినీర్‌ ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

SSC Junior Engineer Jobs 2023: స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజినీరింగ్‌ చదివినవారికి జూనియర్‌ ఇంజినీర్స్‌ ఉద్యోగ నియామకాలకు సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగం పొందినవారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు / శాఖల్లో గ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC Junior Engineer Jobs 2023

CompanyStaff Selection Commission (SSC)
పోస్టులుగ్రూప్‌-బి (నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజినీర్‌.
 ఖాళీల వివరాలు1324
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షకేంద్రాలుచీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
Application modeOnline
SSC Official Websitessc.nic.in

Eligibility Criteria for SSC Junior Engineer Jobs 2023

SSC Junior Engineer Jobs 2023

అర్హతలు

డిప్లొమా (సివిల్‌ / మెకానికల్‌ / ఎలక్ట్రికల్‌) తత్సమానం లేదా  డిగ్రీ, బీఈ / బీ.టెక్‌  (సివిల్‌ / మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌) చదివినవారు అర్హులు.

వయోపరిమితి

పోస్టులకు అనుగుణంగా 18 – 32 సంత్సరాల మధ్య వయసు ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం sc/st, OBC లకి వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది. భారతీయులై ఉండాలి. కొన్ని కేటగిరీలవారికి మినహాయింపులు ఉన్నాయి.

Advertisement

జీత భత్యాలు

సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 ఉంటుంది.

ఎంపిక విధానం:

పేపర్‌-1, పేపర్‌-2 రాత పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం

ఇది రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్‌-1, పేపర్‌-2 ఉంటాయి. పేపర్‌-1 ఆన్‌లైన్‌ విధానంలో(కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ఆబ్జెక్టివ్‌ తరహాలో నిర్వహిస్తారు. పేపర్‌-2 ఆఫ్‌లైన్‌లో జరిగే (డిస్క్రిప్టివ్‌) రాత పరీక్ష. పేపర్‌-1 లో మొత్తం 200 మార్కులకు 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్‌-2లో పెన్‌ అండ్‌ పేపర్‌ విధానంలో నిర్వహించే డిస్క్రిప్టివ్‌ పరీక్ష. పేపర్‌-2 మొత్తం 300 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం రెండు గంటలు.

దరఖాస్తు ఫీజు

రూ.100 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌లకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

Important Dates for SSC Junior Engineer Jobs 2023

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: జూలై 26, 2023

దరఖాస్తు చివరి తేది: ఆగస్ట్ 16, 2023

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: అక్టోబర్‌, 2023.

Important Links for SSC Junior Engineer Notification

ActivityLinks
అధికారిక నోటిఫికేషన్ PDFClick Here
Official WebsiteSSC.NIC.IN
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment