APPSC : గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్ల విడుదలపై క్లారిటీ వచ్చేసింది

Advertisement

APPSC Group1 2 Recruitment 2023: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌ 1, 2 నోటిఫికేషన్లపై ఏపీపీఎస్సీ చైర్మన్‌ స్పష్టత ఇచ్చారు. త్వరలో APPSC Group 1, APPSC Group 2 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) చైర్మన్ గౌతమ్ సవాంగ్‌ వెల్లడించారు. సెప్టెంబరులోపు గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని పేర్కొన్నారు. APPSC Group 1 కింద 100, APPSC Group 2 నోటిఫికేషన్‌ కింద 1000 పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. అలాగే గ్రూప్స్‌ పరీక్షల సిలబస్‌లో కూడా మార్పులు చేయనున్నట్లు స్పష్టం చేశారు. యూపీఎస్సీ విధానంలో ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. అయితే.. ఉద్యోగాల నియామకాలపై బయట వినిపించే వదంతులు నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు.

ఏపీలో నిరుద్యోగులకు తీపి కబురు: 1000 కి పైగా జూనియర్ అసిస్టెంట్,తాసిల్దారు ఉద్యోగాలు, పోస్టుల ఖాళీల వివరాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now
APPSC Group1 2 Notification Clarity

అలాగే.. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 2,020 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఉన్నత విద్యాశాఖ ద్వారా నోటిఫికేషన్‌ జారీ అయితే.. రాత పరీక్ష ఏపీపీఎస్సీ (APPSC) కమిషన్‌ నిర్వహిస్తుందని తెలిపారు. ఇవికాకుండా ఇప్పటికే ఏపీపీఎస్సీ వద్ద ఉన్న 1,199 పోస్టుల భర్తీకి సంబంధించి జారీచేయాల్సిన నోటిఫికేషన్లున్నాయి. ఇందులో సీడీపీఓ, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌, లైబ్రేరియన్‌/అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌, ఇతర పోస్టులు ఉన్నాయని ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. | Clarity on APPSC Group1, 2 Notification 2023 – Release Date?

Advertisement

Advertisement

Leave a Comment